- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు
దిశ, హనుమకొండ : నమ్మదగిన సమాచారం మేరకు సుబేదారి రెవెన్యూ కాలనీలో ఒక ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళను, విటుడులను ను టాస్క్ ఫోర్స్ సుబేదారి పోలీసులు సంయుక్తంగా రైడ్ నిర్వహించి అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే… సుబేదారి రెవెన్యూ కాలనీకి చెందిన ఒక మహిళ ఇల్లు కిరాయికి తీసుకొని ఇతర రాష్ట్రాల నుంచి మహిళలను రప్పించి అత్యంత రహస్యంగా ఓ మహిళ వ్యభిచారం చేయిస్తుంది. ఈ క్రమంలో వరంగల్ రంగశాయిపేట కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇద్దరు మహిళతో ఒప్పందము కుదిర్చి వ్యభిచారం చేస్తుండగా టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు రైడ్ చేసి బాధిత మహిళలను కాపాడి, నిర్వాహకురాలిని తదుపరి విచారణ నిమిత్తం సుబేదారి పోలీసులకు అప్పగించారు. వరంగల్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ ఏ.మధుసూదన్ మాట్లాడుతూ… ఎవరైనా ఆర్గనైజ్డ్ గా ఏర్పడి మహిళలతో వ్యభిచారం చేయించినట్లయితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే వృత్తిగా చేసుకొని రూములు తీసుకొని వ్యభిచారం చేస్తూ పదే పదే దొరికిన నిర్వాహకులపై పిడి చట్టం అమలు చేస్తామని హెచ్చరించారు. హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేసినందుకు ఇన్స్పెక్టర్ సార్ల రాజు, ఆర్ ఎస్ ఐ భాను ప్రకాష్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.