AP Govt:‘తల్లికి వందనం’ పథకం పై ఏపీ సర్కార్ కీలక ప్రకటన

by Jakkula Mamatha |
AP Govt:‘తల్లికి వందనం’ పథకం పై ఏపీ సర్కార్ కీలక ప్రకటన
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి.. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే గత వైసీపీ హయాంలో ఉన్న సంక్షేమ పథకాల పేర్లు మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత ప్రభుత్వంలో ‘అమ్మఒడి’ గా ఉన్న ఈ పథకాన్ని ఎన్డీయే సర్కార్ ‘తల్లికి వందనం’ గా మార్చింది.

ఈ పథకం పై తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారా అని ఏపీ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే జనవరిలో ‘తల్లికి వందనం’ పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులందరికీ ఈ పథకం వర్తించనుంది. ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికి రూ.15 వేల చొప్పున ఇస్తామని టీడీపీ మేనిఫెస్టో లో ప్రకటించింది. ఇందుకు రూ.12 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. రూ.20 వేల లబ్ధి చేకూర్చే ‘అన్నదాత సుఖీభవ’ను మార్చి లేదా ఏప్రిల్‌లో అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed