నేను జైల్లో ఉన్నప్పటికి ఢిల్లీ ప్రజలు ఎలాంటి కష్టాలు పడకూడదు.. కేజ్రీవాల్ సందేశాన్ని వినిపించిన ఆయన భార్య

by Harish |   ( Updated:2024-04-04 14:16:41.0  )
నేను జైల్లో ఉన్నప్పటికి ఢిల్లీ ప్రజలు ఎలాంటి కష్టాలు పడకూడదు.. కేజ్రీవాల్ సందేశాన్ని వినిపించిన ఆయన భార్య
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ గురువారం ఢిల్లీ సీఎం నుంచి వచ్చిన సందేశాన్ని ఆప్ ఎమ్మెల్యేలకు వినిపించారు. అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేలందరికీ సందేశం పంపారు, నేను జైల్లో ఉన్నాను కాబట్టి ఢిల్లీ ప్రజలు ఎలాంటి కష్టాలు పడకూడదు. ప్రతి ఎమ్మెల్యే ప్రతి రోజూ తమ ప్రాంతానికి వెళ్లి ప్రజల సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించాలి. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి ఎలాంటి సమస్యలు రానీయకుండా చసుకోవాలని ఎక్స్‌లో ఢిల్లీ సీఎం సందేశాన్ని సునీతా కేజ్రీవాల్ చెప్పారు.

అలాగే, కేవలం ప్రభుత్వ సంబంధిత సమస్యలను పరిష్కరించడం మాత్రమే కాకుండా, ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రయత్నించాలి, ఢిల్లీలోని 2 కోట్ల మంది ప్రజలు నా కుటుంబం, నా కుటుంబంలో ఎవరూ ఏ కారణం చేతనైనా అసంతృప్తి చెందకూడదు. దేవుడు ప్రతి ఒక్కరినీ ఆశీర్వదిస్తాడు, జై హింద్! అని సునీతా కేజ్రీవాల్ ఎక్స్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు.

ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరు నెలల తర్వాత తీహార్ జైలు నుంచి బయటకు రాగా, సునీతా కేజ్రీవాల్‌ను ఆమె నివాసంలో కలిసిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన రావడం గమనార్హం. మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన తరువాత అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ కింద తీహార్ జైలులో ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed