- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బలూచిస్తాన్‌లో పోలీస్ ట్రక్కుపై ఆత్మహుతి దాడి.. 9 మంది మృతి
X
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్సులో ఆత్మహుతి దాడి కలకలం రేపింది. సోమవారం రద్దీ ఉండే సిబీ ఏరియాలో బైక్‌పై వచ్చిన సూసైడ్ బాంబర్ పోలీస్ ట్రక్కును ఢీకొట్టాడు. ఈ ఘటనలో 9 మంది పోలీసులు మరణించినట్లు అధికారులు తెలిపారు. పోలీసు ట్రక్కును ఆత్మాహుతి బాంబర్ మోటర్‌సైకిల్‌తో ఢీకొట్టడంతో పేలుడు సంభవించిందని నివేదికలు పేర్కొన్నాయి. ఈ దాడిలో మరో ఏడుగురు గాయపడినట్లు చెప్పారు.
వీరిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ మధ్య కాలంలో పోలీసులపై పాకిస్తాన్‌లో దాడులు వరుసగా చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ఏ సంస్థ ఇప్పటి వరకూ ప్రకటించలేదు. బలూచిస్తాన్‌లోని సుసంపన్నమైన వనరులను ప్రభుత్వం దోపిడీ చేస్తుందని ఆరోపిస్తూ బలూచ్ జాతి గెరిల్లాలు దశాబ్దాలుగా ప్రభుత్వంతో పోరాడుతున్నారు.
Advertisement
Next Story