Students:10, 12వ తరగతి పరీక్షల్లో 65 లక్షల మంది ఫెయిల్.. విద్యామంత్రిత్వ శాఖ వెల్లడి!

by vinod kumar |
Students:10, 12వ తరగతి పరీక్షల్లో 65 లక్షల మంది ఫెయిల్.. విద్యామంత్రిత్వ శాఖ వెల్లడి!
X

దిశ, నేషనల్ బ్యూరో: గతేడాది దేశవ్యాప్తంగా 65 లక్షల మంది విద్యార్థులు 10, 12వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యారని విద్యామంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు 56 స్టేట్ బోర్డులు, మూడు సెంట్రల్ బోర్డులు, 59 పాఠశాల బోర్డుల ఫలితాలను విశ్లేషించి ఓ నివేదికను రూపొందించారు. దీని ప్రకారం..పదో తరగతికి చెందిన దాదాపు 33.5 లక్షల మంది విద్యార్థులు తదుపరి తరగతికి వెళ్లలేదు. మరో 5.5 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాకపోగా 28 లక్షల మంది ఫెయిల్ అయ్యారు. అలాగే 12వ తరగతి చదువుతున్న దాదాపు 32.4 లక్షల మంది విద్యార్థులు గ్రేడ్‌ను పూర్తి చేయలేదు. 5.2 లక్షల మంది పరీక్షలకు హాజరుకాకపోగా.. 27.2 లక్షల మంది ఫెయిలయ్యారు.

సెంట్రల్ బోర్డులో పదో తరగతి విద్యార్థుల ఫెయిల్యూర్ రేటు 6 శాతం ఉండగా, స్టేట్ బోర్డుల్లో 16 శాతంగా ఉంది. ఇక, 12వ తరగతిలో సెంట్రల్ బోర్డులో ఫెయిల్యూర్ రేటు 12 శాతం కాగా, స్టేట్ బోర్డుల్లో 18 శాతం ఉంది. అలాగే పదో తరగతిలో మధ్యప్రదేశ్ బోర్డుకు చెందిన విద్యార్థులు అత్యధిక సంఖ్యలో ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాతి స్థానాల్లో బిహార్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. 12వ తరగతిలో ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేదు. ఈ డేటాలో మధ్యప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. 2022తో పోల్చితే 2023లో విద్యార్థుల ఫెయిల్యూర్ రేటు ఎక్కువ కావడం గమనార్హం. రెండు తరగతుల పరీక్షలకు బాలుర కంటే ఎక్కువ మంది బాలికలే హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed