- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vande Bharat రైలుపై మరోసారి రాళ్ల దాడి.. ఈ సారి ఎక్కడంటే..?
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందేభారత్ రైళ్లపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభోత్సవానికి ముందే వందే భారత్ ట్రైన్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరోసారి వందే భారత్ రైలుపై దుండగులు దాడికి పాల్పడ్డారు. తాజాగా బీహార్‌లోని కతిహార్ జిల్లా బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని దుండగులు వందేభారత్ ట్రైన్‌పై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఒక బోగీ అద్దాలు పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ దాడిలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. రైల్వే అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. వందేభారత్ ట్రైన్‌పై దాడికి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత ఏడాది డిసెంబర్ నెలలో కూడా ప్రధాని మోడీ వెస్ట్ బెంగాల్‌లో ప్రారంభించిన నాలుగు రోజులకే వందేభారత్ రైలుపై దాడి జరిగిన విషయం తెలిసిందే.
Also Read...