- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కాట్లాండ్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
దిశ, వెబ్‌డెస్క్: శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని యూకేలోని స్కాట్లాండ్‌లో గల అబర్డీన్ ప్రాంతంలోని హిందూ దేవాలయంలో తెలుగు ప్రాంత ప్రజలతో పాటు అన్ని రాష్ట్రాలకు చెందిన ఎన్.ఆర్.ఐ భక్తులు రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్సవ ప్రాంతానికి తరలివచ్చారు. రామనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.
సీతాసమేత రాములోరిని దర్శించుకునేందుకు భక్తులు క్యూలో బారులు తీరారు. 'శ్రీరామ జయరామ, జయ జయ రామ' అంటూ తెలుగు ప్రాంత భక్తులు నినాదాలతో హోరెత్తించారు. స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వాహకులు పడకంటి వివేక్, గోల్కొండ వేద, రమేశ్ బాబు, డాక్టర్ నాగ ప్రమోద్, బోయపాటి హారిలు అట్టహాసంగా నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది.
స్వామివారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహరాష్ట, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పంజాబ్, హర్యానా, తదితర రాష్ట్రాలకు చెందిన ఎన్.ఆర్.ఐ భక్తులు తరలివచ్చారు. భక్తులు స్వామివారికి కట్నకానుకలు సమర్పించుకున్నారు. అనంతరం స్వామి వారి పల్లకి సేవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణం అనంతరం అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్కాటిష్ ప్రజలు సైతం ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం.