భారత్ హెచ్చరికను సీరియస్ గా తీసుకున్న శ్రీలంక.. నలుగురు ఐసిస్ హ్యాండ్లర్లు అరెస్టు

by Shamantha N |
భారత్ హెచ్చరికను సీరియస్ గా తీసుకున్న శ్రీలంక.. నలుగురు ఐసిస్ హ్యాండ్లర్లు అరెస్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ హెచ్చరికలను శ్రీలంక సీరియస్ గా తీసుకుంది. ఐసిస్ ఉగ్రసంస్థతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో అహ్మాదాబాద్ ఎయిర్ పోర్టులో నలుగురు శ్రీలంక జాతీయుల్ని గుజరాత్ ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. గుజరాత్‌లో అరెస్టయిన నలుగురిని విచారించేందుకు శ్రీలంక అధికారులు గత నెలలో ఉన్నత స్థాయి ఆపరేషన్‌ను ప్రారంభించారు. ఆ నలుగురికి ఐసిస్ తో సంబంధాలున్నాయని విచారణలో తేలడంతో శ్రీలంక పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఉస్మాన్ అనే వ్యక్తి ఈ నలుగురు నిందితులకు హ్యాండ్లర్ అని శ్రీలంక భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. ఉస్మాన్ పేరిట రూ.20 లక్షల రివార్డు కూడా ఉంది. కాగా.. నిందితులకు ఉగ్రవాద సంస్థ నేషనల్ తౌహీద్ జమాత్‌తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. పాకిస్థాన్ ఉగ్రవాది అబూ బకర్ అల్ బాగ్దాదీతో పరిచయం ఏర్పడి ఐసిస్ లో చేరినట్లు తేల్చారు. తీవ్రవాద కార్యకలాపాలకు వీరు భారీమొత్తంలో డబ్బు పంపినట్లు గుర్తించారు.

Advertisement

Next Story