- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ayodhya : అయోధ్యలో అత్యాచార ఘటన.. బాధిత బాలిక తల్లి సంచలన ఆరోపణ
దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య పరిధిలోని ఓ గ్రామంలో ఉన్న బేకరీలో పన్నెండేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలో మరో కీలక విషయం వెలుగుచూసింది. బాలికపై సదరు బేకరీ నిర్వాహకుడు మోయిద్ ఖాన్‌తో పాటు అందులో పనిచేసే ఓ యువకుడు సామూహిక అత్యాచారం చేశారనే అభియోగాలు ఉన్నాయి. బాధిత బాలిక తల్లి మాట్లాడుతూ.. ‘‘మోయిద్ ఖాన్‌పై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటే డబ్బులిస్తామని స్థానిక సమాజ్‌వాదీ పార్టీ నాయకులు నాతో చెప్పారు. మోయిద్ ఖాన్ కూడా ఆ పార్టీలోనే ఆఫీస్ బేరర్‌గా ఉన్నాడు.
అందుకే అతడి తరఫున ఇతర నాయకులు నాపై ఒత్తిడి తెస్తున్నారు’’ అని వెల్లడించారు. ‘‘ఈ కేసును సెటిల్ చేసుకుంటే డబ్బులిస్తామని భదర్సా నగర్ పంచాయత్ ఛైర్‌పర్సన్, సమాజ్‌వాదీ పార్టీ నేత మహ్మద్ రశీద్ నాతో చెప్పారు’’ అని బాలిక తల్లి ఆరోపించారు. ఈ కేసును వెనక్కి తీసుకోవాలంటూ బాలిక తల్లిపై ఒత్తిడి పెరుగుతోందని బీఎస్పీ యూపీ అధ్యక్షుడు వివ్వనాథ్ పాల్ అన్నారు. బీఎస్పీ ప్రతినిధుల బృందానికి ఈవిషయాన్ని ఆమె స్వయంగా చెప్పారని పేర్కొన్నారు.