కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి వాహనాన్ని అడ్డుకున్న వ్యక్తులు

by Harish |
కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి వాహనాన్ని అడ్డుకున్న వ్యక్తులు
X

దిశ, నేషనల్ బ్యూరో: కొంతమంది వ్యక్తులు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ అధిర్ రంజన్ చౌదరి వాహనాన్ని అడ్డుకుని ‘గో బ్యాక్’ అని నినాదాలు చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. అధిర్ రంజన్ తన లోక్‌సభ నియోజకవర్గం బహరంపూర్‌లో మధ్యాహ్నం ప్రచారం ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో కొంతమంది యువకుల గుంపు వాహనానికి ఎదురుగా వచ్చి గో బ్యాక్, గో బ్యాక్ అని గట్టిగా అరుస్తూ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు.

మద్యం మత్తులో ఉన్న కొంతమంది నన్ను అడ్డగించారు. ఇది నన్ను ఆపడానికి చేసిన పన్నాగం తప్ప మరొకటి కాదు. దీని వెనక తృణమూల్ కాంగ్రెస్‌ ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదని టీఎంసీ కోరుకుంటుంది. గత ఎన్నికల సమయంలో కూడా వారు ఇలా చేశారు. నన్ను అడ్డుకోడానికి అధికార టీఎంసీ పార్టీ ఈ విధమైన పద్ధతిని ప్రారంభించింది. కానీ వారు నన్ను ఈ విధంగా ఆపలేరు. ఈ విషయంపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు తెలియజేసి, జోక్యం చేసుకోవాలని కోరినట్లు అధిర్ రంజన్ తెలిపారు. ఆయన1999 నుంచి బెహ్రాంపూర్‌ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా అదే నియోజకవర్గం నుంచి ఎన్నికలో బరిలో ఉన్నారు. చౌదరిపై టీఎంసీ భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్‌ను రంగంలోకి దించింది.

Advertisement

Next Story