- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Heavy Snow : మనాలీలో మంచు బీభత్సం..రోడ్లపైనే 1,000కి పైగా వాహనాలు
దిశ, వెబ్ డెస్క్ : జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh)లోని చాలా ప్రాంతాల్లో విపరీతంగా కురుస్తున్న మంచు(Heavy Snow) ధాటికి ఆ రాష్ట్రాల్లోని పలు రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ లు నెలకొంటున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లోని పర్యాటక ప్రాంతమైన మనాలీ(Manali), సిమ్లా(Shimla) మార్గాల్లో వేలాది వాహనాలు మంచులో దారి కానరాక రోడ్లపైనే చిక్కుకుపోయాయి. ఏటా క్రిస్మస్, నూతన సంవత్సరం పురస్కరించుకుని డిసెంబర్ చివరి వారంలో మనాలీ, సిమ్లాకు పర్యాటకుల తాకిడి భారీగా ఉంటుంది. దీంతో ఆయా ప్రాంతాలన్నీ పర్యాటకులతో కిటకిటలాడుతుంటాయి. అయితే ప్రస్తుతం మనాలీ తోపాటు రాజధాని సిమ్లాలో దట్టంగా మంచు కురుస్తోంది. రహదారులు, కొండలు ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని శ్వేత వర్ణంతో ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి.
హిమపాతం భారీగా పడుతుండటంతో పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా మంచు పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని పలు రోడ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. విపరీతమైన మంచు కారణంగా రోహతంగ్ (Rohtang)లోని సొలాంగ్ (Solang) – అటల్ టన్నెల్ (Atal Tunnel) మధ్య దాదాపు వెయ్యికి పైగా వాహనాలు చిక్కుకుపోయాయి. దట్టంగా మంచు కురుస్తుండటంతో ముందు వాహనాలు కనిపించని పరిస్థితి. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 700 మందికిపైగా పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.