- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
India-Canada: నిజ్జర్ హత్య కేసులో కెనడా రెచ్చగొట్టే కథనం - ఖండించిన విదేశాంగ శాఖ
దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు గురించి భారత్- కెనడా(India-Canada) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో కెనడా మీడియా సంచలన స్టోరీ ప్రచురించింది. అందులో భారత ప్రధాని నరేంద్రమోడీ (PM Modi) పేరును ప్రస్తావించి భారత్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. దీన్ని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ దీనిపై ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘సాధారణంగా మేం మీడియా స్టోరీలపై స్పందించబోం. కానీ, కెనడా ప్రభుత్వ వర్గాలను ఉద్దేశిస్తూ వెలువడిన ఈ హాస్యాస్పద వార్తలను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దుష్ప్రచారాల వల్ల ఇప్పటికే దెబ్బతిన్న ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింతగా దిగజారుస్తాయి’’ అని జైస్వాల్ పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే..?
కెనడా (Canada)కు చెందిన ‘ది గ్లోబ్ అండ్ మెయిల్’ వార్తాపత్రికలో ఇటీవల నిజ్జర్ హత్య (Nijjar Murder Case) గురించి ఓ స్టోరీ ప్రచురితమైంది. ఈ హత్యకు కుట్రలో భారత (India) జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ కూడా భాగమైనట్లు తమకు తెలిసిందని కెనడా సీనియర్ జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు ఆ స్టోరీలో ఉంది. అంతేకాకుండా.. ఏకంగా భారత ప్రధాని నరేంద్రమోడీ పేరును కూడా ఇందులో ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. దీంతో, ఈ స్టోరీలపై భారత్ తీవ్రంగా మండిపడింది. ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్ (Nijjar Murder Case) హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి టైంలోనే ఇటీవల నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మ పేరును చేర్చింది. దీంతో, ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. కాగా.. సంజయ్ వర్మ సహా ఆ దేశంలోని మన దౌత్యవేత్తలను భారత్ వెనక్కి రప్పించింది. అదే సమయంలో ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తల్ని బహిష్కరించింది.