Sikkim flood: ‘తీస్తా’ వరదల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు..

by Vinod kumar |
Sikkim flood: ‘తీస్తా’ వరదల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు..
X

గాంగ్ టక్: తీస్తా నది వరదల ధాటికి సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లోని అనేక ప్రాంతాలు చిగురుటాకులా వణుకుతున్నాయి. ఇప్పుడు వరదల్లో ఆర్మీకి చెందిన పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రి కొట్టుకొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇలా కొట్టుకొని వచ్చిన ఆయుధం పేలి ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డ ఘటన కలవరపెడుతోంది. దీంతో నదిలో కొట్టుకువచ్చే పేలుడు పదార్థాలు, అనుమానిత వస్తువులను ముట్టుకోవద్దని జల్‌పాయ్‌గురి, కూచ్ బిహార్ జిల్లాల అధికారులు వార్నింగ్ ఇష్యూ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సిక్కిం ప్రభుత్వం కూడా అడ్వైజరీ జారీ చేసింది.

తీస్తా నదీ తీరం వెంట వాటిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ ఆయుధాలన్నీ ఇటీవల వరదల్లో కొట్టుకుపోయిన సైనిక శిబిరాలలోనివే అని గుర్తించారు. ఇక సిక్కిం వరదల్లో ఇప్పటివరకు 40 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఏడుగురు సైనికులు ఉన్నట్లు సమాచారం. గల్లంతైన మరో 15 మంది సైనికుల కోసం హెలికాప్టర్ల సాయంతో ఆర్మీ గాలింపు చర్యలు కొనసాగిస్తోంది.

Advertisement

Next Story