- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముంబై ఎయిర్‌పోర్టులో రూ. 20 కోట్ల కొకైన్ పట్టుకున్న అధికారులు
దిశ, నేషనల్ బ్యూరో: ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ. 19.79 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సియెర్రా లియోన్‌కు చెందిన మహిళ నుంచి 1,979 గ్రాముల కొకైన్ పట్టుబడగా, ఆమెను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అరెస్టు చేసినట్టు సోమవారం ఓ అధికారి తెలిపారు. కెన్యా రాజధాని నగరం నైరోబీ నుంచి ముంబైలో దిగిన మహిళను డ్రగ్స్ ఉన్నాయనే పక్కా సమాచారంతో ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు అధికారి పేర్కొన్నారు. ఆమె వద్ద షూ, మాయిశ్చరైజర్ బాటిల్, షాంపూ బాటిళ్ల అడుగు భాగంలో తెల్లటి పౌడర్ ఉన్నట్టు కనుగొన్నామని, దాన్ని పరీక్షించిన తర్వాత కొకైన్‌గా తేలినట్టు అధికారులు వివరించారు. మహిళను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించామని, డ్రగ్స్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై విచారణ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. గత బుధవారం సైతం అంతర్జాతీయ కార్టెల్‌కు చెందిన డ్రగ్స్‌ను గుర్తించిన డీఆర్ఐ అధికారులు, డ్రగ్స్ స్మగ్లింగ్‌కు సంబంధించి నలుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ. 100 కోట్ల విలువైన 9 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.