Siddaramaiah: రైతులకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకుంటాం.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

by vinod kumar |
Siddaramaiah: రైతులకు ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకుంటాం.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: తమ భూములను అక్రమంగా వక్ఫ్ ఆస్తులుగా గుర్తించారని కర్ణాటకలోని విజయపుర జిల్లాకు చెందిన రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. రైతులు ఎవరినీ ఖాళీ చేయబోమని, వారికి జారీ చేసిన నోటీసులను ఉపసంహరించు కుంటామని చెప్పారు. మంగళవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. రైతులకు నోటీసులు జారీ చేస్తే వాటిని వెనక్కి తీసుకుంటామన్నారు. ఒక్క రైతును కూడా వారి భూమి నుంచి వెళ్లగొట్టబోమని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అంతకుముందు కర్ణాటక పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలో ఉన్న 2019 నుంచి 2022 మధ్య విజయపుర జిల్లాలోని రైతులకు వక్ఫ్ బోర్డు నోటీసులు పంపించిందని ఆరోపించారు. కాగా, విజయపుర జిల్లాలోని పలువురు రైతులకు తమ భూములు వక్ఫ్ ఆధీనంలోకి వస్తాయని వెంటనే ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో రైతులు తీవ్ర నిరసనలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య స్పందించడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed