దేవెగౌడ ప్లాన్ చేసి మనవడిని విదేశాలకు పంపారు : సీఎం సిద్ధరామయ్య

by Hajipasha |
దేవెగౌడ ప్లాన్ చేసి మనవడిని విదేశాలకు పంపారు : సీఎం సిద్ధరామయ్య
X

దిశ, నేషనల్ బ్యూరో : మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ ముందస్తుగా ప్లాన్ చేసి మనవడు ప్రజ్వల్ రేవణ్ణను విదేశాలకు పంపించారని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. ‘‘ఎవరైనా విదేశాలకు వెళ్లడానికి పాస్‌పోర్ట్ ఎవరు ఇస్తారు ? వీసా ఎవరు ఇస్తారు? అవన్నీ చేసేది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రానికి తెలియకుండా ప్రజ్వల్ రేవణ్ణ ఇండియా దాటి వెళ్లగలడా? ముందస్తు ప్లాన్ ప్రకారమే అతడిని దేశం దాటించారు’’ అని సిద్ధరామయ్య కామెంట్ చేశారు. రేవణ్ణకు అందుబాటులో ఉన్న డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని, త్వరగా ఆయన దేశానికి తిరిగొచ్చేలా చూడాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సిద్ధరామయ్య లేఖ కూడా రాశారు. ఈ వీడియోలను డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విడుదల చేశారన్న హెచ్‌డీ కుమారస్వామి ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య ఖండించారు. ‘‘ప్రజ్వల్‌కు సంబంధించిన సెక్స్ వీడియోలను బీజేపీ నేత జి దేవరాజేగౌడకు ఇచ్చానని ప్రజ్వల్ రేవణ్ణ డ్రైవర్ కార్తీక్ వెల్లడించాడు. అతడు డీకే శివకుమార్ పేరు చెప్పలేదే ? అలాంటప్పుడు డీకే శివకుమార్‌పై కుమారస్వామి ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు ?’’ సీఎం సిద్ధరామయ్య ప్రశ్నించారు.

Advertisement

Next Story