'మీ టార్గెట్ లోక్ సభ ఎన్నికలే.. కనీసం 20 సీట్లలో కాంగ్రెస్ గెలవాలి'

by Vinod kumar |
మీ టార్గెట్ లోక్ సభ ఎన్నికలే.. కనీసం 20 సీట్లలో కాంగ్రెస్ గెలవాలి
X

బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య శనివారం కొత్తగా 24 మంది మంత్రులను చేర్చుకున్నారు. దీంతో తన కేబినెట్ లో మొత్తం 34 మంది మంత్రులకు చోటు కల్పించినట్లు అయింది. త్వరలో పోర్టుఫోలియోలను కేటాయిస్తామన్న సిద్ధరామయ్య ఈ మంత్రులకు కొత్త టాస్క్ ఇచ్చారు. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే టార్గెట్ గా నిర్ధేశించారు. రాష్ట్రంలోని 28 లోక్ సభ స్థానాల్లో కనీసం 20 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడాల్సిందేనని స్పష్టం చేశారు.

ఈ విజయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు కానుకగా ఇవ్వాలని ఆదేశించారు. నిబద్ధత, నిజాయితీ, చురుకుదనంతో తమ బాధ్యతలు నిర్వహించి పార్టీ విజయానికి మంత్రి పదవులను వినియోగించాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని, స్థానిక సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed