అమిత్ షా బహిరంగ చర్చకు రావాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సవాల్

by S Gopi |
అమిత్ షా బహిరంగ చర్చకు రావాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: హామీ పథకాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయ్యిందని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సవాల్ విసిరారు. హామీ పథకాల కారణంగా ఖజానాకు వచ్చిన సమస్యేమీ లేదని తాను నిరూపించగలనని, ఈ విషయంపై అమిత్ షా తనతో బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. ఆదివారం ఉదయం అమిత్ షా మైసూరులోని చాముండేశ్వరి ఆలయాన్ని సందరించారు. ఆ తర్వాత రాబోయే లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను చర్చించేందుకు రాష్ట్ర బీజేపీ నాయకులతో సమవేశాలను నిర్వహించారు. ఈ క్రమంలోనే ఓ ప్రకటనలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. దీనికి కౌంటర్‌గా సిద్ధరామయ్యా, 'అమిత్ షా ఈ విషయంలో స్పష్టంగా ఉంటే గనక, తనతో బహిరంగ చర్చకు పాల్గొనాలి. మా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అవ్వలేదని నిరూపించగలను. అలాగే, కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల ఆదాయంలో అన్యాయం జరుగుతున్నది వాస్తవం. దీనిపై కూడా అమిత్ షాను సవాల్ చేస్తున్నాను' అని కర్ణాటక సీఎం తెలిపారు. తమ ప్రభుత్వ హామీ పథకాలను నిరూత్సాహపరిచేందుకు బీజేపీ నేతకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన ముఖ్యమంతి, కర్ణాటక ప్రజలపై ద్వేషం పెంచుకున్నారా అని ప్రశ్నించారు. అలా చేస్తే వారికి చాముండేశ్వరి దేవీ, శ్రీరాముడి ఆశీస్సులు ఉండవన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ రాష్ట్ర హామీ పథకాలను దొంగలించారని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed