Shocking: మనిషి పేగులో సంచరిస్తున్న బొద్దింక.. తొలగించిన వైద్యులు

by Ramesh Goud |
Shocking: మనిషి పేగులో సంచరిస్తున్న బొద్దింక.. తొలగించిన వైద్యులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: న్యూఢిల్లీలోని ఫోర్టీస్ ఆసుపత్రిలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. మనిషి పేగులో బ్రతికున్న బొద్దింకను వైద్యులు గుర్తించారు. ఫాస్ట్ ఫుడ్ తిని మూడు రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్న 23 ఏళ్ల యువకుడు.. వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఫోర్టీస్ హాస్పటల్ కు వెళ్లాడు. యువకుడిని పరీక్షించిన వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. అతడి చిన్న పేగులో 3 సెంటీ మీటర్ల బ్రతికున్న బొద్దింక సంచరిస్తుండటాన్ని గమణించారు. అది నెమ్మదిగా కదులుతుండటాన్ని గుర్తించిన వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేయాలని, లేకుంటే ప్రాణానికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని సూచించారు.

అనంతరర అధునాతన ఎండోస్కొపిక్ పద్దతిని ఉపయోగించి ఆ వ్యక్తికి 10 నిమిషాల్లోనే శస్త్రచికిత్స నిర్వహించి బొద్దింకను బయటకి తీశారు. దీంతో ఆ వ్యక్తి ప్రాణానికి ముప్పు తప్పినట్టు అయ్యింది. ముక్కు, నోటి ద్వారా ఎండోస్కోపి చేయడం వల్లనే బొద్దింకను వెలికితీయడం సాధ్యం అయ్యిందని సీనియర్ వైద్యులు శుభం వాత్స్యా తెలిపారు. అలాగే రోగి తినేటప్పుడు తెలియక బొద్దింకను మింగి ఉంటాడని, లేదా నిద్రిస్తున్నప్పుడు నోటి ద్వారా బొద్దింక లోపలికి వెళ్లి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అంతేగాక బొద్దింకను తీయడం ఆలస్యం అయ్యి ఉంటే దీర్ఘకాలిక సమస్యలకు దారి తీసేదని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed