హర్యానాలో బీజేపీకి షాక్..ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల రాజీనామాలకు ఆమోదం

by vinod kumar |
హర్యానాలో బీజేపీకి షాక్..ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల రాజీనామాలకు ఆమోదం
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందు ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల రాజీనామాలను హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా సోమవారం ఆమోదించారు. వీరిలో నలాగఢ్ ఎమ్మెల్యే కేఎల్ ఠాకూర్, డెహ్రా ఎమ్మెల్యే హోషియార్ సింగ్, హమీర్‌పూర్ ఎమ్మెల్యే ఆశిష్ శర్మ ఉన్నారు. రాష్ట్రంలోని రాజ్యసభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఈ ముగ్గురూ బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు ఓటు వేశారు. అనంతరం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. దీనిపై విచారణ చేపట్టిన స్పీకర్ తాజాగా రాజీనామాలను ఆమోదించారు. స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతించిన ఎమ్మెల్యే ఠాకూర్, ఇది ఆలస్యమైనా సరైన నిర్ణయమని తెలిపారు. స్పీకర్ ముందుగా రాజీనామాలను ఆమోదించి, ఈ మూడు అసెంబ్లీ స్థానాలకు కూడా లోక్‌సభ ఎన్నికలతో పాటు ఎన్నికలు నిర్వహిస్తే బాగుండేదని చెప్పారు.

కాగా, రాష్ట్రంలో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు గాను మెజారిటీకి 35 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 59కి తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 34 మంది, బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానాలకు జూన్ 1న లోక్‌సభ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ 6 స్థానాల ఫలితాలు వెలువడిన తర్వాత మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 65కి చేరుతుంది. అప్పుడు మెజారిటీ సంఖ్య 33 అవుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 34గా ఉంది. అయితే ఆరు స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని ప్రయత్నిస్తున్న బీజేపీకి షాక్ తగిలినట్టు అయింది. ప్రస్తుతం ఆరు సెగ్మెంట్లలో గెలిచినా వారి సంఖ్య 31 మాత్రమే అవుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో నలుగురు ఎమ్మెల్యేలు అవసరం.

Advertisement

Next Story

Most Viewed