Sheikh Hasina: ఇండియాలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షాపింగ్

by Ramesh Goud |
Sheikh Hasina: ఇండియాలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షాపింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఇండియాలో షాపింగ్ చేశారు. ఆమె గజియాబాద్ లో 30 వేలతో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసినట్లు జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి. బంగ్లాదేశ్ లో ప్రభుత్వం పై నిరసనలు వెళ్లువెత్తడంతో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి ఇండియాకు వచ్చారు. భారత్ కు వచ్చిన హసీనాను ప్రభుత్వం గజియాబాద్ లోని హిండన్ ఎయిర్ బేస్ లో ఆశ్రయం కల్పించింది. అంతేగాక ఆమె ఎంతకాలమైనా ఇండియాలో ఉండవచ్చని పార్లమెంట్ వేదికగా తెలియజేశింది. హసీనా బంగ్లాను వీడే సమయంలో ఆమెతో కొన్ని సూట్ కేసులు మినహా పెద్దగా వస్తువులేవి తెచ్చుకోలేదు.

దీంతో బుధవారం ఆమె హిండన్ ఎయిర్ బేస్ లోని షాపింగ్ కాంప్లెక్స్ లో సోదరి రెహ్మానాతో కలిసి షాపింగ్ చేసినట్లు తెలిసింది. ఇందులో ఆమె 30 వేలకు పైగా నిత్యావసర వస్తువులు కోనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె వద్ద ఉన్న ఇండియన్ మనీ అయిపోవడంతో బంగ్లాదేశ్ టాకా చెల్లించి తనకు కావల్సిన వస్తువులను తీసుకున్నట్లు జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి. కాగా హసీనా బంగ్లాదేశ్ నుంచి వెళ్లేటప్పుడు ఆమెతో రెండు బ్యాగులు, నాలుగు సూట్ కేసులు తీసుకెళ్లిందని వార్తలొచ్చాయి. ఇక హిండన్ ఎయిర్ బేస్ వద్ద రెండు ఎంబసీ వాహానాలు రావడంతో హసీనాను ఢిల్లీ తరలిస్తున్నారని, అక్కడి నుంచి ఆమె దుబాయ్ వెళ్లే అవకాశం ఉందని ఊహాగానాలు వెళువడ్డాయి.

Advertisement

Next Story

Most Viewed