- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందిరాగాంధీకే తప్పలేదు.. ఉద్ధవ్‌కు శరత్ పవార్ సలహా!
దిశ, డైనమిక్ బ్యూరో: మరాఠ రాజకీయల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహారాష్ట్ర బెబ్బులిగా పేరు గాంచిన దివంగత బాల్ థాక్రే వారసుడు ఉద్ధవ్ థాక్రేకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. శివసేన పార్టీ పేరు, పార్టీ ఎన్నికల గుర్తు 'విల్లు-బాణం'ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే వర్గానికి కేటాయించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ మిత్రపక్షంగా ఉన్న ఉద్ధవ్ వర్గానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కీలక సలహా ఇచ్చారు. ఉద్ధవ్ వర్గం విల్లు బాణం గుర్తు కోల్పోవడం పెద్దగా ప్రభావం చూపదని అన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని అంగీకరించి కొత్త గుర్తును తీసుకోవాలని థాక్రేకు సూచించారు.
కొత్త చిహ్నాన్ని ప్రజలు ఆణోదిస్తారని పేర్కొన్నారు. ఇది ఎన్నికల సంఘం నిర్ణయం కాబట్టి ఒకసారి నిర్ణయం తీసుకుంటే చర్చకు వీలుండదని అందువల్ల పాత గుర్తు కోసం చర్చించకుండా కొత్త గుర్తుతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. సింబల్ ఇష్యూపై పక్షం నుంచి నెల రోజుల వరకే చర్చ ఉంటుందని ఆ తర్వాత అందరూ మర్చిపోతారని పవార్ చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా సింబల్ సమస్యను ఎదుర్కొందని, ఇందిరాగాంధీ లాంటి వారికే సింబల్ సమస్య తప్పలేదని గుర్తు చేశారు.
కాంగ్రెస్ రెండు ఎద్దుల ఎన్నికల చిహ్నం కోల్పోయి హస్తం గుర్తుకు మారాల్సి వచ్చిందని కాంగ్రెస్ కొత్త గుర్తును ప్రజలు ఆమోదించినట్లుగానే ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన కొత్త గుర్తును ప్రజలు అంగీకరిస్తారని అన్నారు. కాగా సింబల్ విషయాన్ని అంత తేలికగా వదిలిపేట్టేది లేదని ఉద్ధవ్ వర్గం చెబుతోంది. విల్లు బాణం గుర్తును ఏక్ నాథ్ షిండే వర్గానికి ఈసీ కేటాయించడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసే యోచనలో ఉద్ధవ్ వర్గం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఏ విల్లు విల్లు బాణం గుర్తుతో మహారాష్ట్ర రాజకీయాలను ఒంటి చేతితో బాల్ థాక్రే షేక్ చేశారో అదే గుర్తు ఇప్పుడు థాక్రే కుటుంబం నుంచి చేజారిపోవడం మరాఠా రాజకీయాల్లో సంచలనంగా మారింది.