'గడియారం' కోసం సుప్రీం మెట్లు ఎక్కనున్న శరద్ పవార్

by M.Rajitha |
గడియారం కోసం సుప్రీం మెట్లు ఎక్కనున్న శరద్ పవార్
X

దిశ, వెబ్ డెస్క్ : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(NCP) అధినేత శరద్ పవార్(Sharad Pawar) 'గడియారం' గుర్తు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లారు. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ గడియారం గుర్తును వినియోగించకుండా చూడాలని శరద్ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎన్నో ఏళ్లుగా ఎన్సీపీ అధ్యక్షుడిగా ఉన్నానని, తన పార్టీకి ఆ గుర్తుకు గల బంధాన్ని వెల్లడిస్తూ.. ఓటర్లు తికమక పడకుండా, అజిత్ వర్గం గడియారం గుర్తును వాడకుండా నిరోధించమని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అజిత్ వర్గం మరో గుర్తు కోసం దరఖాస్తు చేసుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు. కాగా ఇటీవల జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో జరిగిన గందరగోళాన్ని కూడా పిటిషన్లో ప్రస్తావిస్తూ.. మరోసారి ఇలా జరగకుండా చూడాలని శరద్ పవార్ సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్ అక్టోబర్ 15న విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. ఎన్సీపీ వర్గం నుండి వేరు పడిన అజిత్ పవార్.. ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరి ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

Next Story

Most Viewed