Jharkhand polls: జార్ఖండ్ ఎన్నికల వేళ బీజేపీకి షాక్

by Shamantha N |   ( Updated:2024-10-22 09:35:04.0  )
Jharkhand polls: జార్ఖండ్ ఎన్నికల వేళ బీజేపీకి షాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల(Jharkhand assembly polls) వేళ బీజేపీకి షాక్ తగిలింది. కాషాయ పార్టీకి చెందిన పలువురు నేతలు జార్ఖండ్ ముక్తి మోర్చా(JMM) పార్టీలో చేరారు. పార్టీ మారిన వారిలో బీజేపీ మాజీ ఎమ్మెల్యేలు లూయిస్ మారండి, కునాల్ సారంగి, ల‌క్ష్మ‌ణ్ తండు కూడా ఉన్నారు. మూడు సార్లు బీజేపీ టికెట్‌పై గెలిచిన కేదార్ హ‌జ్రా కూడా ఇటీవ‌ల జేఎంఎం పార్టీలో చేరారు. బీజేపీ నుంచి 2014లో లూయిస్ మ‌రాండి.. 5వేల ఓట్ల తేడాతో దుమ్కాలో సీఎం హేమంత్ సోరెన్‌పై విజ‌యం సాధించారు. ఇప్పుడు లూయిస్ మ‌రాండి జేఎంఎంలో చేరారు. మాజీ బీజేపీ నేత‌ల‌కు వెల్క‌మ్ చెబుతూ సీఎం హేమంత్ సోరెన్ త‌న ఎక్స్‌లో ట్వీట్ చేశారు. అయితే దుమ్కా స్థానం నుంచి 2019లో హేమంత్ సోరెన్ 13వేల ఓట్ల తేడాతో లూయిస్ మ‌రాండిపై గెలుపొందారు. అదే స్థానంలో జ‌రిగిన బైపోల్స్‌లో బ‌సంత్ సోరెన్ చేతిలో లూయిస్ ఓడిపోయారు.

రెండు దశల్లో ఎన్నికలు

ఇకపోతే, 81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నవంబర్ 13, నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు రానున్నాయి. మొదటి దశలో ఎన్నికలు జరగనున్న 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు, మిగతా స్థానాలకు రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం నుంచి నామినేషన్ పత్రాల దాఖలు ప్రారంభమైంది. ఇప్పటివరకు ముగ్గురు నామినేషన్లు సమర్పించారు. ఇకపోతే, జార్ఖండ్ ఎన్నికల్లో మొత్తం 2.60 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Advertisement

Next Story

Most Viewed