Sena vs Sena:సేన వర్సెస్ సేన.. వర్లీ స్థానంలో పోటాపోటీ

by Shamantha N |
Sena vs Sena:సేన వర్సెస్ సేన.. వర్లీ స్థానంలో పోటాపోటీ
X

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. గెలుపు కోసం అధికార మహాయుతి, ప్రతిపక్ష మాహా వికాస్ అఘాడీ పోటీ పడుతున్నాయి. ముంబైలోని వర్లీ స్థానంలో శివసేన వర్సెస్ శివసేనగా మారింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తనయుడు ఆదిత్య వర్లీ నుంచే పోటీ చేస్తున్నాడు. అయితే, ఆదిత్య ఠాక్రేకు వ్యతిరేకంగా మాజీ ఎంపీ మిలింద్‌ దేవ్‌రాను బరిలో దించాలని సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గం శివసేన పార్టీ నిర్ణయించింది. ఆదిత్య నామినేషన్‌ దాఖలు చేసిన మరుసటి రోజే ఏక్‌నాథ్‌ షిండే పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఇప్పటికే మూడుసార్లు ఎంపీ..

ఇకపోతే, మిలింద్‌ దేవ్‌రా సౌత్ ముంబై నుంచి ఇప్పటికే మూడు సార్లు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేనకు చెందిన సందీప్ దేశ్‌పాండే కూడా వర్లీ నుంచే తలపడనున్నారు. ఇకపోతే, మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు నవంబర్‌ 20న పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది.

Advertisement

Next Story

Most Viewed