హైదరాబాద్ విమానాశ్రయంలో సెల్ఫ్ బ్యాగేజీ డ్రాప్ సదుపాయం

by Mahesh |   ( Updated:2023-06-28 03:29:45.0  )
హైదరాబాద్ విమానాశ్రయంలో సెల్ఫ్ బ్యాగేజీ డ్రాప్ సదుపాయం
X

దిశ, వెబ్‌డెస్క్: సెల్ఫ్ బ్యాగేజీ డ్రాప్ సర్వీస్‌ను జూన్ 26న GMR హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రవేశ పెట్టారు. అలాగే ఢిల్లీలో కూడా ఈ విధానాన్ని ప్రవేశ పెట్టారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ఎంట్రీ గేట్ నెంబర్ 9 దగ్గర ఏర్పాటు చేసిన సెల్ఫ్ బ్యాగేజీ డ్రాప్ సర్వీస్‌‌లో.. స్కానర్‌లు, స్కేల్స్ సెన్సార్‌లతో కూడిన ఎనిమిది ఆటోమేటిక్ మెషీన్‌లను ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చేశారు. దీని సహాయంతో ప్రయాణికులు తమ బ్యాగేజీ చెక్-ఇన్ సదుపాయాన్ని 45-60 సెకన్లలో పూర్తి చేసేందుకు వీలు కల్పిస్తుంది. అధికారిక ప్రకటన తెలిపింది.

Advertisement

Next Story