- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Secunderabad-Goa Train: గోవా వెళ్లే తెలుగు పర్యాటకులకు గుడ్ న్యూస్..సికింద్రాబాద్ నుంచి మరో కొత్త రైలు
దిశ, వెబ్‌డెస్క్:తెలుగు రాష్ట్రాల(Telugu states) నుంచి గోవా(Goa) వెళ్లే పర్యాటకులకు(Tourists) దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా(Secunderabad to Vasco da Gama) వరకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు ను నడపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా ఈ కొత్త రైలు ఈ నెల 6 నుంచి అందుబాటులోకి రానుంది.రెగ్యులర్ సర్వీసులు ఈ నెల 9న సికింద్రాబాద్ నుంచి ,10న వాస్కోడగామా నుంచి ప్రారంభం కానున్నాయి.సికింద్రాబాద్-వాస్కోడగామా(17039) రైలు ప్రతి బుధ,శుక్రవారాల్లో, వాస్కోడగామా-సికింద్రాబాద్ (17040) రైలు ప్రతి గురు,శనివారాల్లో బయలుదేరుతాయి.ఈ రైలు కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్‌పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, క్యాజిల్ రాక్, కుళెం, సాన్‌వోర్డెం, మడ్‌గావ్ జంక్షన్‌లలో ఆగుతుంది.
కాగా..ప్రస్తుతం కాచిగూడ-వాస్కోడగామా(Kachiguda-Vascoda Gama) మధ్య మంగళ,బుధ,శుక్ర,ఆది వారాల్లో రెగ్యులర్ సర్వీస్(17603) నడుస్తోంది. అలాగే నాంపల్లి-వాస్కోడగామా(Nampally-Vascodagama) మధ్య మరో రైలు(17021) ఉంది.ఈ రెండు రైళ్లు 100 ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయని, సీట్లు దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి(G.Kishan Reddy) కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Ashwini Vaishnav)కు గతంలో లేఖ రాశారు.దీంతో సానుకూలంగా స్పందించిన మంత్రి సికింద్రాబాద్ మరియు వాస్కోడిగామా (గోవా) మధ్య రెండు వారాల ఎక్స్‌ప్రెస్ రైలును ప్రకటించారు.కాగా ప్రతి ఏటా దాదాపు 80 లక్షల మంది పర్యాటకులు గోవాను సందర్శిస్తుండగా ఇందులో 20 శాతం మంది తెలుగు రాష్ట్రాలకు చెందినవారు ఉండడం విశేషం.