Mpox advisory to states: మంకీపాక్స్ వ్యాప్తిపై రాష్ట్రాలకు అడ్వైజరీ

by Shamantha N |
Mpox advisory to states: మంకీపాక్స్ వ్యాప్తిపై రాష్ట్రాలకు అడ్వైజరీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘మంకీపాక్స్‌’ (Mpox) వైరస్‌ వ్యాప్తిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మంకీపాక్స్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ కట్టడి చేయడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health ministry) అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. అనుమానితులకు పరీక్షలు నిర్వహించాలని సూచించింది. వారి కాంటాక్ట్‌ లిస్ట్‌ను తయారు చేయాలని తెలిపింది. జిల్లాల్లో ప్రజారోగ్య సంసిద్ధతపై సమీక్ష నిర్వహించాలని రాష్ట్ర అధికారులకు సూచించింది. అనుమానిత, ధ్రువీకరించిన కేసుల సంరక్షణ కోసం ఆస్పత్రుల్లో ఐసోలేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలంది. అటువంటి సౌకర్యాలలో సిబ్బందికి కూడా శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది.

మంకీపాక్స్ అనుమానిత కేసు

కాగా, ఇప్పటికే ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ప్రాణాంతకమైన మంకీపాక్స్‌ (ఎంపాక్స్‌) లక్షణాలున్న అనుమానిత కేసు భారత్‌లో నమోదైంది. ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన ఒక యువకుడిలో వ్యాధి లక్షణాలు కన్పించడంతో వెంటనే అతడిని ఐసోలేషన్‌కు తరలించారు. మంకీపాక్స్‌కు సంబంధించి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇకపోతే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం.. జనవరి 2022 నుండి ఆగస్టు 2024 వరకు 120 దేశాలకు మంకీపాక్స్ వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు లక్ష కేసులు నమోదు కాగా.. 220 మరణాలు నమోదయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed