- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించడానికి నిరాకరించిన ఎస్‌బీఐ
దిశ, నేషనల్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఎన్నికల కమిషన్ (ఈసీ)కి అందజేసిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఆర్టీఐ చట్టం కింద వెల్లడించడానికి నిరాకరించింది. వ్యక్తిగత సమాచారం విశ్వసనీయమైందని, ఎన్నికల బాండ్ల వివరాలు ఈసీ వెబ్‌సైట్‌లో ఉన్నప్పటికీ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈసీకి సమర్పించిన వివరాల డిజిటల్ డేటాను ఇవ్వాలని కోరుతూ ఆర్టీఐ కార్యకర్త లోకేశ్ బాత్రా దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని ఎస్‌బీఐ తిరస్కరించింది. ఆర్టీఐ చట్టంలో ఉన్న సెక్షన్ 8(1)(ఈ), సెక్షన్ 8(1)(జే) ప్రకారం, విశ్వసనీయ, వ్యక్తిగత సమాచారాన్ని బయటకు వెల్లడించలేమని పేర్కొంది. ఎన్నికల బాండ్లు కొన్నవారు, రాజకీయ పార్టీల సమాచారాన్ని బహిర్గతం చేయడం ఆయా చట్టాల పరిధిలో నేరమవుతుందని ఎస్‌బీఐ వివరించింది. ఇదే సమయంలో సుప్రీంకోర్టులో తమ కేసు వాదించడానికి సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేకు చెల్లించిన ఫీజు వివరాలను కూడా లోకేశ్ బాత్రా కోరగా, రికార్డులు విశ్వసనీయ హోదాలో ఉన్నాయని, సమాచారం వ్యక్తిగతమని పేర్కొంది. అయితే, ఈసీ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్ని ఇచ్చేందుకు ఎస్‌బీఐ నిరాకరించడం పట్ల లోకేశ్ బాత్రా పేర్కొన్నారు.