- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sanjay Raut: ఎంపీ సంజయ్ రౌత్‌కు షాక్.. పరువు నష్టం కేసులో15 రోజుల జైలు శిక్ష
దిశ, నేషనల్ బ్యూరో: శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌కు షాక్ తగిలింది. బీజేపీ నేత కిరీట్ సోమయ్య భార్య మేధా సోమయ్య దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ముంబై కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. అలాగే15 రోజుల జైలు శిక్షతో పాటు..రూ. 25వేల జరిమానా విధించింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 500 కింద మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రౌత్‌ను దోషిగా నిర్ధారించి తీర్పు వెల్లడించింది. మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణకు సంబంధించిన రూ.100 కోట్ల కుంభకోణంలో రౌత్ తనపై, తన భర్తపై నిరాధారమైన ఆరోపణలు చేశారని మేధా సోమయ్య ఆరోపించారు. మీడియా ముఖంగా చేసిన ఈ ప్రకటనలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తన ఆరోపణలపై రౌత్ సరైన ఆధారాలు చూపకపోవడంతో దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది.