CM Samosa: సీఎం సమోసా మిస్సింగ్.. సీఐడీ ఎంక్వైరీ వేసిన సర్కార్

by karthikeya |   ( Updated:2024-11-08 08:22:13.0  )
CM Samosa: సీఎం సమోసా మిస్సింగ్.. సీఐడీ ఎంక్వైరీ వేసిన సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘‘సార్! నా గుడ్డు పోయింది..’’ అంటూ ఓ సినిమాలో హీరోయిన్ తన మేనేజర్‌కి కంప్లైంట్ చేసే ఫన్నీ సీన్ గుర్తుందా..? కానీ అది సినిమాలో కాబట్టి ఓకే. అదే రియల్ లైఫ్‌లో అలా జరిగితే..? అది కూడా ఏకంగా ఓ సీఎం సమోసా పోతే..? ఏంటి కామెడీ చేస్తున్నాను అనుకుంటున్నారా..? కాదండీ బాబూ. నిజంగానే ఓ సీఎం సమోసా పోయింది. అంతేకాదు.. ఆ సమోసాలు ఎక్కడికి పోయాయో వెతకడానికి ఏకంగా ఓ సీనియర్ అధికారితో సీఐడీ ఎంక్వైరీ కూడా వేసింది ప్రభుత్వం. ఇంతకీ ఈ విచత్రం ఎక్కడ జరిగిందా..? అని ఆలోచనలో పడ్డారా..? అయితే చదవండి.

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్.. ఏం చేస్తుంది..? పెద్ద పెద్ద క్రిమినల్ కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేసి క్రిమినల్స్‌ని పట్టుకుంటుంది. కానీ అంతపెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సమోసాలు పోయిన కేసును దర్యాప్తు చేయడానికి రెడీ అయింది. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లో జరిగింది. అసలేం జరిగిందంటే.. రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సుక్కు.. అక్టోబర్ 21న ఏదో పని మీద సీఐడీ ఆఫీస్‌కి వచ్చారు. అయితే ఆయన కోసం అధికారులు సమోసాలు, కేక్ తెప్పించారు. అయితే ఈ కేక్, సమోసాలు సీఎం వరకు చేరకుండానే మాయమైపోయాయి. దీంతో అధికారులకు కోపం వచ్చింది. సీఎంకి కూడా తన సమోసాలు పోయాయని తెలియగానే ఆగ్రహంతో ఏకంగా సీఐడీ ఎంక్వైరీకి ఆదేశించి సమోసా దొంగలను పట్టుకోవాలని ఆదేశించారు. ఇంకేముంది అధికారులు రంగంలోకి దిగిపోయారు.

ఈ విషయం తెలియడంతో బీజేపీ నాయకులు సుక్కూను కార్నర్ చేయడం మొదలుపెట్టారు. ‘ప్రజల కష్టాల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించకుండా సమోసాలు పోయాయని సీఐడీ ఎంక్వైరీ వేస్తారా?’ అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాకు చేరడంతో అక్కడ కూడా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని, సీఎం సుక్కూను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. దీనిపై సీఎంను మీడియా ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.





Advertisement

Next Story

Most Viewed