- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Salman Khan: ధైర్యం ఉంటే వారిని రక్షించాలి.. సల్మాన్‌కు మరోసారి బెదిరింపులు
దిశ, నేషనల్ బ్యూరో: బీటౌన్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi gang) నుంచే థ్రెట్ మెసేజ్ వచ్చింది. ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి హెచ్చరించారు. బిష్ణోయ్ గ్యాంగ్ పేరును ప్రస్తావిస్తూ వచ్చిన పాటపై సల్మాన్‌కు బెదిరింపులు వచ్చాయి. ‘ఈ పాట రచయిత నెలలోగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుది. మరోసారి పాటలు రాయలేని విధంగా లిరిసిస్ట్ పరిస్థితి ఉంటుంది. సల్మాన్‌కు ధైర్యం ఉంటే ఆ గేయ రచయితను, మిగతా వారిని రక్షించాలి’ అని దుండగులు హెచ్చరించారు. ఈ వ్యక్తులపై వర్లీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
గతంలోనూ బెదిరింపులు
కాగా.. సల్మాన్‌ఖాన్‌కు (Salman Khan) వరుసగా బెదిరింపులు వస్తున్నాయి. గతంలోనూ పలుమార్లు బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఆయనకు బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో సల్మాన్ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. ఇక, అంతకుముందు పన్వేల్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు కొందరు ప్రయత్నించారు. ఇటీవల సల్మాన్‌కు బెదిరింపులు వచ్చిన కేసులో కర్ణాటకలోని హవేరిలో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే రాజస్థాన్‌లో మరో వ్యక్తిని కూడా మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌కు పోలీసులు అప్పగించారు. వరుస బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచింది.