కాల్పులు విరమణకు రెడీ కానీ.. షరతులు వర్తిస్తాయి అంటున్న రష్యా

by Shamantha N |
కాల్పులు విరమణకు రెడీ కానీ.. షరతులు వర్తిస్తాయి అంటున్న రష్యా
X

దిశ, నేషనల్ బ్యూరో: రెండేళ్లుగా ఉక్రెయిన్- రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఇలాంటి టైంలో రష్యా అధ్యక్షుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ చేసేందుకు రెడీగా ఉన్నామని.. కానీ దానికి కొన్ని షరతులు ఉన్నాయని పేర్కొన్నారు. రష్యా విదేశాంగ శాఖ కార్యాలయంలో పుతిన్‌ మాట్లాడారు. వెంటనే కాల్పుల విరమణ చేస్తామని అన్నారు. అంతేకాకుండా చర్చలు కూడా ప్రారంభిస్తామన్నారు. అందుకోసం, రష్యా స్వాధీనంలో ఉన్న నాలుగు ప్రాంతాల్లో బలగాలను ఉపసంహరించుకోవాలని తెలిపారు. దాంతోపాటు, నాటోలో చేరాలన్న ఆలోచనను విరమించుకోవాలని కీవ్‌కు షరతు విధించారు. యుద్ధం ముగించేందుకే ఈ ప్రతిపాదన తెచ్చామన్నారు. ఆలస్యం చేయకుండా చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు.

రష్యాకు రాని జీ7 సదస్సు ఆహ్వానం

ఇటలీలో జీ7 సమావేశాలు జరుగుతున్న టైంలో పుతిన్ ఇలాంటి ప్రకటన చేశారు. మరోవైపు, జీ7 సదస్సుకు రష్యాకు ఆహ్వానం అందలేదు. రష్యాను పిలవడం వేస్ట్ ఆఫ్ టైం అని పశ్చిమదేశాలు విమర్శలు గుప్పించాయి. ఇకపోతే, రష్యా ఆఫర్ ను ఉక్రెయిన్ అంగీకరించకపోవచ్చు. ఉక్రెయిన్‌కు చెందిన దాదాపు ఐదోవంతు భూమి క్రిమియా ఆధీనంలోనే ఉంది. రష్యా దళాలను పూర్తిగా ఉపసంహరించుకోవడం.. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను పునరుద్ధరించడంపైనే శాంతి ఆధారపడి ఉంటుందని గతంలోనే కీవ్ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed