RSS chief on Bangladesh: వారిని రక్షించాల్సిన బాధ్యత మనదే

by Shamantha N |
RSS chief on Bangladesh: వారిని రక్షించాల్సిన బాధ్యత మనదే
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో హింసకు బలవుతున్న హిందువులను రక్షించాల్సిన బాధ్యత భారత్‌పై ఉన్నదని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(RSS) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు హింసకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. "రాబోయే తరాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే, ప్రపంచంలో ఎప్పుడూ ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించే వ్యక్తులు ఉంటారు. ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. వారిని ప్రజల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి" అని మోహన్ భగవత్ వెల్లడించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యాలయంలో జెండాను ఎగురవేసిన తర్వాత ఆయన మాట్లాడారు.

బంగ్లాదేశ్ గురించి ఏమన్నారంటే?

పరిస్థితి ఎల్లవేళలా ఒకేలా ఉండదని ఆయన అన్నారు. ఇప్పుడు పొరుగు దేశంలో అలాంటి పరిస్థితే ఉంది. పొరుగుదేశంలో హింస జరుగుతోంది. అక్కడ నివసించే హిందువులపై ఎలాంటి కారణం లేకుండా దాడులు జరుగుతున్నాయి. అని బంగ్లాదేశ్ ని ఉద్దేశించి పరోక్షంగా మాట్లాడారు. ఇతరులకు సహాయం చేసే సంప్రదాయం భారతదేశంలో ఉందన్నారు. గత కొన్నేళ్లుగా భారత్ ఎవరిపైనా దాడి చేయలేదని గుర్తుచేశారు. కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందించామన్నారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న అస్థిరత, అరాచకాల వల్ల అక్కడున్న హిందువులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బంగ్లాదేశ్ లోని మైనారిటీలను ఆదుకోవాల్సిన బాధ్యత భారత్ పై ఉందన్నారు.

Advertisement

Next Story

Most Viewed