- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ.80,455 కోట్ల ప్రమాద బీమా పరిహారం పెండింగ్: ఆర్టీఐ దరఖాస్తులో వెలుగులోకి
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా రూ. 80,455 కోట్ల విలువైన 10,46,163 మోటారు ప్రమాద బీమా క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్టీఐ నివేదికలో వెల్లడైంది. 2018-23 మధ్య వీటి సంఖ్య భారీగా పెరిగినట్టు తెలిపింది. 2018-19లో 9,09,166 క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉండగా..ఈ సంఖ్య 2022-23 నాటికి 10,46,163కు చేరుకుంది. ప్రమాద బాధితులకు అందజేసే ప్రమాద క్లెయిమ్‌లు టైంకి అందుతున్నాయా లేదా అని గత నెలలో సుప్రీంకోర్టు న్యాయవాది కేసీ జైన్ ఆర్టీఐలో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి ప్రతి స్పందించిన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) వివరాలను అందజేసింది.
2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 10,39,323 కాగా, ఈ ఏడాది వచ్చిన కొత్త క్లెయిమ్‌ల సంఖ్య 4,54,944. దీంతో పెండింగ్‌లో ఉన్న మొత్తం క్లెయిమ్‌లు 14,94,267కు చేరుకుంది. వీటిలో 4,48,104 కేసులు మాత్రమే పరిష్కరించినట్టు తెలుస్తోంది. ఇది మొత్తం కేసులలో 29 శాతం మాత్రమే కావడం గమనార్హం. దీనిపై స్పందించిన జైన్ భారీగా క్లెయిమ్ లు పెండింగ్ లో ఉండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మోటారు యాక్సిడెంట్ క్లెయిమ్‌ల తీర్పులో విపరీతమైన జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల విషయంలో నిర్ణయం, పరిహారం చెల్లింపులో జాప్యాన్ని పరిగణనలోకి తీసుకుని మధ్యంతర చెల్లింపును డిమాండ్ చేస్తూ రిట్ పిటిషన్ కింద సుప్రీంకోర్టులో మధ్యంతర దరఖాస్తును దాఖలు చేసినట్లు తెలిపారు. బాధితులకు ఉపశమనం లభించేలా మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 164A కింద కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించాలని తెలిపారు.