- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అమెరికాలో రోడ్డు ప్రమాదం: ముగ్గురు భారత సంతతి విద్యార్థులు మృతి
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో జార్జియా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారత సంతతి విద్యార్థులు మరణించగా..మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈనెల 14న ఈ ఘటన చోటు చేసుకోగా..అల్పారెట్టా పోలీసులు తాజాగా వివరాలు వెల్లడించారు. జార్జియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఆర్యన్ జోషి, శ్రీయా, అన్వీ శర్మ, రిత్వక్ సోమేపల్లి, మహ్మద్ లియాకత్ అనే ఐదుగురు భారత సంతతి విద్యార్థులు కారులో ఓ కార్యక్రమానికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే జార్జియాలోని అల్ఫారెట్టా సమీపంలో వారు ప్రయాణిస్తు్న్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో ఆర్యన్ జోషి, శ్రియలు అక్కడికక్కడే మరణించగా..అన్వీ శర్మ పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మృతి చెందారు. మిగతా ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత విద్యార్థులంతా 18ఏళ్ల వయసు వారే కావడం గమనార్హం.దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతి వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా, గత నెల అరిజోనాలోని లేక్ ప్లెసెంట్ సమీపంలో పలు వాహనాలు ఢీకొన్న ఘటనలో తెలంగాణకు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించిన విషయం తెలిసిందే.
Read More..