వ్యక్తి గుర్తింపునకు ప్రాథమికం పేరే.. ఢిల్లీ హైకోర్టు

by Shamantha N |
వ్యక్తి గుర్తింపునకు ప్రాథమికం పేరే.. ఢిల్లీ హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: పేరుతో లేదా పిల్లల తల్లిదండ్రులుగా గుర్తించే హక్కు.. వ్యక్తి గుర్తింపునకు ప్రాథమికమని పేర్కొంది ఢిల్లీ హైకోర్టు. సీబీఎస్ఈ మార్క్ షీట్ లలో తండ్రి పేరుని మార్చాలని కోరుతూ ఓ యువతి పిటిషన్ వేసింది. దీనిపైనే విచారణ జరుపుతున్నప్పుడు వ్యక్తి గుర్తింపుపై ఆసక్తికర కామెంట్లు చేసింది ఢిల్లీ హైకోర్టు.

సీబీఎస్ఈ పది, పన్నెండో తరగతి సర్టిఫికెట్లలో పేర్కొన్న పేరు పిటిషనర్ తండ్రిది కాదని.. తన తండ్రి చనిపోయినందున యువతి తన మామ పేరుని ఇచ్చిందని కోర్టు పేర్కొంది. పబ్లిక్ డాక్యుమెంట్లలో పిటిషనర్ తండ్రి పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నప్పటికీ.. పేరు అనేది గుర్తింపు మార్కర్ అని వ్యాఖ్యానించింది. అలాంటి సందర్భాల్లో ఆచరణాత్మకమైన పద్ధతిని పాటించాలని పేర్కొంది. పేరుతో కానీ.. పిల్లల తల్లిదండ్రులుగా గుర్తించడం అనేది ప్రాథమిక హక్కు అని పేర్కొంది. ఆ విషయంలో పిటిషన్ వేసినప్పుడు.. అభ్యర్థన నిజమైనదైతే దాన్ని నిర్ధారించేందుకు కోర్టు ఉందని హైకోర్టు జడ్జి జస్టిస్ సి.హరిశంకర్ అన్నారు.

పిటిషనర్ తండ్రి పేరుపై సందేహం వ్యక్తం చేయడం కష్టమని.. నిర్ధారించేందుకు ఆధార్, నివాస పత్రాలను పరిగణలోకి తీసుకుంది కోర్టు. ఒక పేరుని స్థానిక భాష నుంచి ఇంగ్లీష్ లోకి మార్చినప్పుడు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండవచ్చని తెలిపింది. కోర్టు ఇలాంటి విషయాల్లో హైపర్ టెక్నికల్ గా ఉండొద్దని పేర్కొంది. శ్రీవాస్తవ్, శ్రీవాస్తవ మధ్య స్పెల్లింగ్ లో కొంచెం తేడా ఉన్నందున దిద్దుబాటు కోసం చేసిన అభ్యర్థనను తిరస్కరించలేమంది.

పిటిషనర్‌కు ఆమె తండ్రి సరైన పేరు ఉండేలా పది, పన్నెండో తరగతి మార్క్ షీట్ లను జారీ చేయాలని సీబీఎస్ఈని ఆదేశించింది కోర్టు. పబ్లిక్ డాక్యుమెంట్లలో స్పెల్లింగ్ లో తేడాలు ఉన్నందున.. సరైన పేరుకు సంబంధించిన అఫిడవిట్ ను సీబీఎస్ఈకి అందించాలని పిటిషన్ ను ఆదేశించింది. ఆ విషయంలో బోర్డుకు పరిహారం చెల్లించాలని పిటిషనర్ ను కోరింది ఢిల్లీ హైకోర్టు.

Advertisement

Next Story

Most Viewed