DK Shivakumar : అక్రమాస్తుల కేసులో డీకే శివకుమార్‌కు ఊరట

by Hajipasha |
DK Shivakumar : అక్రమాస్తుల కేసులో డీకే శివకుమార్‌కు ఊరట
X

దిశ, నేషనల్ బ్యూరో : అక్రమాస్తుల కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌కు ఊరట లభించింది. ఈ కేసులో డీకే శివకుమార్‌ను విచారించేందుకు అనుమతి ఇచ్చేది లేదని రాష్ట్ర సర్కారు స్పష్టం చేయడాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక హైకోర్టులో సీబీఐ, బీజేపీ ఎమ్మెల్యే బసన్ గౌడ పాటిల్ యత్నాల్ పిటిషన్లు దాఖలు చేశారు.

దీనిపై విచారించిన న్యాయస్థానం ఆ పిటిషన్లను తిరస్కరించింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె.సోమశేఖర్, ఉమేశ్ ఆడిగలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ‘‘ఈ వ్యవహారంలో సీబీఐ కేంద్ర బిందువుగా ఉంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన విషయం. ఇలాంటి కేసులను విచారించేందుకు సరైన వేదిక సుప్రీంకోర్టు’’ అని ఈసందర్భంగా హైకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది.

Advertisement

Next Story

Most Viewed