కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్త చైర్‌పర్సన్‌గా రవ్‌నీత్ కౌర్

by Mahesh |
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్త చైర్‌పర్సన్‌గా రవ్‌నీత్ కౌర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)కి కొత్త చీఫ్‌గా రవ్‌నీత్ కౌర్ నియమితుల్యారు. ఈమె 1988 పంజాబ్ IAS కేడర్‌కు చెందినది. కాగా 2022 అక్టోబర్ లో అశోక్ కుమార్ గుప్తా పదవిని తొలగించినప్పటి నుండి పోటీ నియంత్రణకు పూర్తి-సమయ చైర్‌పర్సన్ ఎవరూ లేరు. CCI సభ్యురాలు సంగీత వర్మ గత సంవత్సరం అక్టోబర్ నుండి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా.. రవ్‌నీత్ కౌర్ నియామకం బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి ఐదేళ్ల పాటు లేదా ఆమెకు 65 ఏళ్లు వచ్చే వరకు ఈ పదవిలో ఉంటారు. అలాగే CCI చైర్ పర్సన్‌కు ఘరిష్ఠంగా నెలకు రూ. 4,50,000 ఏకీకృత జీతం పొందుతారు.

CCI కొత్త చీఫ్ రవ్‌నీత్ కౌర్ ఎవరు?

CCI కొత్త చీఫ్‌గా నియమితులైన రవ్‌నీత్ కౌర్ 1988 పంజాబ్ కేడర్ IAS అధికారి.

రవ్‌నీత్ కౌర్ రెండు దశాబ్దాలకు పైగా తన కెరీర్‌లో వివిధ ప్రభుత్వ పదవులను నిర్వహించారు.

కౌర్ 2006-2008 మధ్య రెండేళ్లపాటు ఆర్థిక వ్యవహారాల శాఖలో డైరెక్టర్‌గా పనిచేశారు.

ఆమె 2008 నుంచి 2011 వరకు ఆర్థిక సేవల శాఖలో జాయింట్ సెక్రటరీగా కూడా నియమితులయ్యారు.

రవ్‌నీత్ కౌర్ 2012 నుంచి 2013 వరకు 11 నెలల పాటు పంజాబ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు.

రవ్‌నీత్ కౌర్ 2017-2019 వరకు ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ (CMD)గా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed