- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోలీసు స్టేషన్‌లో 19 కిలోల గంజాయిని తినేసిన ఎలుకలు
దిశ, నేషనల్ బ్యూరో : ఎలుకల బ్యాచ్.. 9 కిలోల ఎండు గంజాయి, 10 కిలోల గంజాయి పాయసాన్ని తినేసిందట!! ఈవిషయాన్ని స్వయంగా పోలీసులే కోర్టుకు తెలిపారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలో ఉన్న రాజ్‌గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 2018 డిసెంబర్ 14న పది కిలోల గంజాయి పాయసం, తొమ్మిది కిలోల ఎండు గంజాయిని శంభుప్రసాద్ అగర్వాల్, అతడి కొడుకు నుంచి రాజ్‌గంజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తాజాగా ఆ కేసు ధన్‌బాద్ జిల్లాలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి రామ్ శర్మ ఎదుట విచారణకు వచ్చింది.
ఫైల్‌ను పరిశీలించిన కోర్టు.. ఆరేళ్ల క్రితం స్వాధీనం చేసుకున్న గంజాయి నిల్వలన్నీ తమ ఎదుట చూపించాలని రాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అధికారికి ఆదేశాలు జారీచేసింది. దీంతో నీళ్లు నమిలిని పోలీసు అధికారులు ఒక ఆసక్తికరమైన రిపోర్టును రెడీ చేశారు. పోలీసు స్టేషన్‌లోని గోదాంలో నిల్వ చేసిన డ్రగ్స్‌ను ఎలుకలు పూర్తిగా ధ్వంసం చేసి, తినేశాయని ప్రస్తావిస్తూ రూపొందించిన నివేదికను కోర్టుకు సమర్పించారు. ఈనేపథ్యంలో శంభుప్రసాద్ అగర్వాల్, అతడి కొడుకు కూడా శనివారం రోజు కోర్టు తలుపు తట్టారు. 2018 సంవత్సరంలో స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను చూపించే స్థితిలో పోలీసులు లేనందున.. తమపై నమోదు చేసిన స్మగ్లింగ్ అభియోగాలను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈమేరకు వారి న్యాయవాది కేసులో వాదనలు వినిపించారు. తన క్లయింట్స్‌ను పోలీసులు అక్రమంగా డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఇరికించారని లాయర్ ఆరోపించారు.