- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
డీప్ ఫేక్ వీడియో కలకలం.. పోలీసులను ఆశ్రయించిన బాలీవుడ్ హీరో
దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ పోలీసులను ఆశ్రయించారు. తన డీప్ ఫేక్ వీడియో వైరల్ గా మారడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు రణ్ వీర్ సింగ్. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. దర్యాప్తు కొనసాగుతోందని రణవీర్ సింగ్ టీమ్ తెలిపింది. ఇకపోతే, రణ్ వీర్ కు చెందిన డీప్ ఫేక్ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో దేశ రాజకీయాలపై రణ్‌వీర్ తన అభిప్రాయాన్ని తెలిపినట్లుగా ఉంది. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా రణ్‌వీర్ కామెంట్ చేసినట్లు ఉన్నది. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆ వీడియోలో రణ్‌వీర్ కోరుతున్నట్లుగా ఉన్నది.
ఇటీవల రణ్‌వీర్ వారణాసి వెళ్లాడు. అయితే అక్కడ రణ్‌వీర్ తన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు ఆ వీడియోలో ఉంది. కానీ ఆ వీడియో ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ వీడియో అని తెలిసింది. ఏఐ టెక్నాలజీ ద్వారా ఆడియోను మార్చివేసినట్లు గుర్తించారు. ఈ వైరల్ వీడియోపై సోషల్ మీడియాలో రణ్ వీర్ స్పందించాడు. సోషల్ మీడియా అభిమానులకు జాగ్రత్తలు తెలిపాడు. డీప్‌ఫేక్ సో బచో దోస్తో(డీప్ ఫేక్ పట్ల జాగ్రత్త) అంటూ రణ్‌వీర్ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
గతంలో, నటుడు అమీర్ ఖాన్ కూడా ఒక రాజకీయ పార్టీని ప్రమోట్ చేస్తూ కనిపించిన డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, తన 35 ఏళ్లకెరీర్ అమీర్ ఏ రాజకీయ పార్టీకి ప్రచారం చేయలేదని ఆయన ప్రతినిధి తెలిపారు. ఇక భారత్ లోనే కాకుండా యూఎస్, పాక్, ఇండోనేషియాతో సహా ప్రపంచంలోని ఇతర చోట్ల ఎన్నికల్లో డీప్‌ఫేక్‌లు ఎక్కువగా వాడుతున్నారు.