Girl Students : తుప్పుపట్టిపోతున్న 1500 కొత్త స్కూటర్లు.. ఏడాదిన్నర కాలంగా పార్కింగ్ స్టాండ్‌‌‌లోనే

by Hajipasha |   ( Updated:2024-10-11 15:34:30.0  )
Girl Students : తుప్పుపట్టిపోతున్న 1500 కొత్త స్కూటర్లు.. ఏడాదిన్నర కాలంగా పార్కింగ్ స్టాండ్‌‌‌లోనే
X

దిశ, నేషనల్ బ్యూరో : దాదాపు 1500కుపైగా బ్రాండెడ్ కొత్త స్కూటర్లు గత ఏడాదిన్నర కాలంగా పార్కింగ్ స్టాండుకే పరిమితమయ్యాయి. దీంతో అవి తుప్పు పట్టే దశకు చేరాయి. ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ కనబర్చే విద్యార్థినులకు బహుమతిగా అందించేందుకు ఈ స్కూటర్లను రాజస్థాన్‌లోని గత కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. కాంగ్రెస్ హయాంలో 2020 సంవత్సరంలో ‘కాళీ బాయి భీల్ స్కూటీ స్కీం’ను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఒక్కో స్కూటరుకు రూ.80వేలు చొప్పున దాదాపు రూ.12 కోట్లు వెచ్చించి 1500కుపైగా స్కూటీలను కొన్నారు. రాజస్థాన్‌లోని బన్‌స్వారా పరిధిలో ఉన్న రెండు ఇంటర్ కాలేజీల్లోని పార్కింగ్ స్టాండ్‌లలో ఈ కొత్త స్కూటర్లు తుప్పు పట్టి పోతున్నాయి. ఇంకొన్ని నెలలైతే అవి ఎందుకూ పనికి రాకుండా పోయే అవకాశం ఉంది.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన బీజేపీ సర్కారు కూడా వీటిపై ధ్యాస పెట్టలేదు. మీడియా కథనాలకు స్పందనగా కొన్ని రోజుల క్రితమే బీజేపీ సర్కారు ఈ స్కూటీలను తనిఖీ చేయమని ఆదేశాలు జారీ చేసింది. అవి వర్కింగ్ కండీషన్‌లో ఉన్నాయా లేదా అనేది నిర్ధారించమని కోరింది. వారంలోగా ఈ స్కూటీలకు అర్హులకు పంపిణీ చేస్తామని రాజస్థాన్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బాబూలాల్ ఖరాడీ వెల్లడించారు. స్కూటీల పంపిణీలో జాప్యం చేసినందుకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే ఈ స్కూటీల పంపిణీ ఆగిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed