Rain Effect: వర్షంతో కొట్టుకుపోయిన ముంబై - అహ్మదాబాద్ హైవే.. భారీ గోతుల్లో ఇరుక్కున్న వాహనాలు

by Shiva |
Rain Effect: వర్షంతో కొట్టుకుపోయిన ముంబై - అహ్మదాబాద్ హైవే.. భారీ గోతుల్లో ఇరుక్కున్న వాహనాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రుతు పవనాల ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. జనం ఇళ్లల్లోంచి బయటకు రావడం లేదు. మరోవైపు చాలా పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఈ క్రమంలోనే నిత్యం రద్దీగా ఉండే ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారి కొట్టుకుపోయి భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో హైవేపై భారీ ఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. ఇక హెవీ లోడ్ ఉన్న వాహనాలు ఏకంగా రోడ్డుపైనే దిగబడుతున్నాయి. తాజాగా, ముంబై - అహ్మదాబాద్ హైవేపై రోడ్డు కొట్టుకుపోయి గుంతలు ఏర్పడి రెండు ట్రక్కులతో సహా నాలుగు వాహనాలు ఆ గుంతల్లో దిగబడ్డాయి. దీంతో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది.

Advertisement

Next Story

Most Viewed