- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘోర రైలు ప్రమాదం.. హుటాహుటిన బెంగాల్ బయలుదేరిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
దిశ, వెబ్ డెస్క్: సోమవారం ఉదయం 9 గంటల ప్రారంతంలో పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు రైళ్లు ఒకదానినొకటి బలంగా ఢీకొన్నాయి. దీంతో కాంచనజంగ ఎక్స్‌ప్రెస్‌ను బోగీలో ఆమాతం గాల్లోకి ఎగిరిపడినట్లు ఘటన స్థలంలోని ఫోటోలు వీడియోలు చూస్తే తెలుస్తుంది. అలాగే పలు బోగీలు ఇప్పటికే దాదాపు 15 మీటర్ల ఎత్తులో వేలాడుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది ప్రయాణికులు మృతి చెందగా 50 మంది వరకు గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదం గురించి ఆరా తీసిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ హుటాహుటిన డార్జిలింగ్ బయలుదేరారు. అలాగే ఆన్ లైన్ లో అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్న మంత్రి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అలాగే ప్రమాదానికి గల కారణాలకు కూడా వీలైనంత త్వరగా కనుక్కొవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా గత సంవత్సర కాలంలో భారత్ లో ఇది నాలుగో ప్రమాదం కావడంతో దేశవ్యాప్తంగా ఇండియన్ రైల్వేశాఖపై పలు విమర్శలు వస్తున్నాయి.
- Tags
- Train accident