మణిపూర్‌లో రాహుల్ పర్యటన..జాతి హింస బాధితులకు పరామర్శ

by vinod kumar |
మణిపూర్‌లో రాహుల్ పర్యటన..జాతి హింస బాధితులకు పరామర్శ
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో పర్యటించారు. జిరిబామ్, చురచంద్‌పూర్ జిల్లాల్లోని సహాయ శిబిరాలను సందర్శించారు. జాతి హింసకు గురైన బాధిత కుటుంబాలను పరామర్శించారు. అక్కడి ప్రజలు పలు సమస్యలను రాహుల్ కు వివరించారు. తమను ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదని ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని విజ్ఞప్తి చేశారు. జిరిబామ్‌లో రాహుల్‌కు స్వాగతం పలికేందుకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారని, ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కెయిశం మేఘచంద్ర తెలిపారు. బాధిత ప్రజలతో భేటీ అనంతరం రాహుల్ గవర్నర్ అనుసూయా ఉయికేను కలిశారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ఆయనతో చర్చించారు. కాగా, మణిపూర్‌లో గతేడాది మే నుంచి మెయితీ, కుకీ కమ్యూనిటీల మధ్య అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అల్లర్లలో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

Advertisement

Next Story