Rahul: దేశంలో రెండు భావజాలాల మధ్యే పోరు.. రాహుల్ గాంధీ

by vinod kumar |
Rahul: దేశంలో రెండు భావజాలాల మధ్యే పోరు.. రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలో రెండు భావజాలాల మధ్యే పోరు జరుగుతోందని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఒకరు సమానత్వంపై మాట్లాడుతుంటే, మరొకరు ప్రజలను భయపెట్టడంలో నిమగ్నమై ఉన్నారన్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఆయన శనివారం శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. ఇటీవల సింద్ దుర్గ్ జిల్లాలో కూలిన శివాజీ విగ్రహం బీజేపీ శివసేన ప్రభుత్వానికి తమ భావజాలం తప్పు అనే సందేశాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ‘శివాజీ మహారాజ్ ఏ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాడాడో అదే సిద్ధాంతానికి వ్యతిరేకంగా నేడు కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది. బీజేపీ శివాజీ విగ్రహాన్ని తయారు చేసిన కొన్ని రోజుల తర్వాత అది విరిగి పడిపోయింది. వారు శివాజీ విగ్రహాన్ని తయారు చేయాలనుకుంటే ముందుగా శివాజీ మహారాజ్ సిద్ధాంతాన్ని కాపాడాలి’ అని చెప్పారు. దేశంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి శివాజీ మహారాజ్ ముందు తలవంచడం వల్ల ప్రయోజనం లేదని తెలిపారు.

Advertisement

Next Story