స్పీకర్ ఓం బిర్లాతో రాహుల్ భేటీ..ఎమర్జెన్సీ వ్యాఖ్యలపై అసంతృప్తి

by vinod kumar |
స్పీకర్ ఓం బిర్లాతో రాహుల్ భేటీ..ఎమర్జెన్సీ వ్యాఖ్యలపై అసంతృప్తి
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం స్పీకర్ చాంబర్‌లో సమావేశమయ్యారు. సభలో ఎమర్జెన్సీని ప్రస్తావించడంపై రాహుల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా రాజకీయ అంశమని, దీనిని నివారించొచ్చని తెలిపారు.రాహుల్ తో పాటు సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆర్జేడీ ఎంపీ మిసా భారతి, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం నేత సుప్రియా సూలే, టీఎంసీ నేత కళ్యాణ్ బెనర్జీ కూడా ఉన్నారు. మరోవైపు ఇదే అంశంపై స్పీకర్ బిర్లాకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శ కేసీ వేణుగోపాల్ లేఖ రాశారు. సభలో ఎమర్జెన్సీని ప్రస్తావించడం తీవ్ర దిగ్భ్రాంతికరమైందని పేర్కొన్నారు. పార్లమెంటు చరిత్రలో ఎన్నడూ ఈ విధంగా జరగలేదని తెలిపారు. పార్లమెంటరీ సంప్రదాయాలను అపహాస్యం చేయడం పట్ల కాంగ్రెస్ తీవ్ర ఆందోళన చెందుతున్నట్టు వెల్లడించారు. కాగా, ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికైన తర్వాత 1975లో ఎమర్జెన్సీ విధించడాన్ని ఈ సభ ఖండిస్తోందని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed