రాజకీయ నాయకుడిగా ఉండడం చాలా కష్టం: Rahul Gandhi

by Mahesh |   ( Updated:2023-05-31 06:40:08.0  )
రాజకీయ నాయకుడిగా ఉండడం చాలా కష్టం: Rahul Gandhi
X

దిశ, డైనమిక్ బ్యూరో : భారత్‌లో ఒక రకంగా రాజకీయ నాయకుడిగా వ్యవహరించడం కూడా చాలా కష్టంగా మారిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 రోజుల అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ బుధవారం శాన్ ఫ్రాన్సిస్కోలో ‘మొహబ్బత్ కీ దుకాన్’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ ప్రయోజనాల కోసం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. భారతదేశంలో రాజకీయాలకు అవసరమైన అన్ని సాధనాలను బీజేపీ, ఆర్ఎస్ఎస్ నియంత్రిస్తున్నాయని చెప్పారు.

భారత్‌లో రాజకీయ వాతావరణం క్లిష్టంగా ఉందని...ప్రజలను బెదిరిస్తున్నారని, ఏజెన్సీలను ప్రజలపై ప్రయోగిస్తున్నారని రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వ్యాప్తి చేస్తున్న విద్వేషాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. ‘మొహబ్బత్ కీ దుకాన్’ సయీద్ ఆలోచనపై రాహుల్ మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రలో తమతో మనుషులే కాదు, ప్రజల ప్రేమ కూడా నడిచిందని అన్నారు.

Read more:

భారత్ జోడో యాత్ర దేశ ప్రజలను ఏకం చేసింది.. రాహుల్ గాంధీ

Advertisement

Next Story

Most Viewed