రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీకి ఓటమి తప్పదు: అమిత్ షా

by S Gopi |
రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీకి ఓటమి తప్పదు: అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల ముందు నుంచి ఎంతో ఉత్కంఠ రేపిన కాంగ్రెస్ కంచుకోట నియోజకవర్గాలు అమేఠీ, రాయ్‌బరేలీలలో ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలో రాయ్‌బరేలీ నుంచి పోటీకి నామినేషన్ కూడా దాఖలు చేసిన రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీలోనూ బరిలో ఉన్నారు. శుక్రవారం కర్ణాటకలోని చిక్కొడిలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన అమిత్ షా.. రాహుల్ బాబాను సోనియా గాంధీ 20 సార్లు లాంచ్ చేసినా ఇప్పటివరకు గెలవలేకపోతున్నారు. ఈసారి కూడా రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ వేశారు. ఈ ప్రయోగం కూడా విఫలమవుతుందని తెలుసు, రాహుల్ గాంధీ ఓటమిని అంగీకరించాల్సిందేనని అన్నారు. 'ఈ వేదిక నుంచి రాహుల్ గాంధీకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ ఎన్నికల్లో రాహుల్ బాబా రాయ్‌బరేలీ నుంచి తమ బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్ చేతిలో భారీ తేడాతో ఓటమి తప్పదు. ఇదే సమయంలో దేశంలో కాంగ్రెస్ హయాంలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, అయితే ముఖ్యమంత్రిగా, ప్రధానిగా మోడీకి అవినీతి మచ్చ లేదని, దేశాభివృద్ధికి పాటుపడుతున్నారని అమిత్ షా అన్నారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ సైతం రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ పోటీపై స్పందించారు. కేర‌ళ‌లోని వ‌య‌నాడ్‌లో ఓట‌మి భ‌యంతోనే రాహుల్ గాంధీ రాయ్‌బ‌రేలి నుంచి కూడా పోటీ చేస్తున్నార‌ని అన్నారు.

Advertisement

Next Story