- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు నోటీసులు
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు నోటీసులు జారీ చేసింది. పరువు నష్టం కేసులో జూన్ 7న కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. కాగా, గత బీజేపీ ప్రభుత్వం అన్నీ పనుల్లో 40 శాతం కమీషన్ వసూలు చేసిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం పేపర్‌లలో ప్రకటనలు ఇచ్చింది. ‘40 శాతం కమీషన్ ప్రభుత్వం’ అని ఆరోపణలు చేసింది. గతంలోని బీజేపీ సర్కారు అవినీతి రేటు కార్డులను నిర్ణయించిందని ఆరోపిస్తూ పోస్టర్లు ముద్రించింది.
కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంకు బెయిల్
అయితే, అప్పటి సీఎం బొమ్మై సహా బీజేపీ నేతలందరూ కాంగ్రెస్ పై మండిపడ్డారు. తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాహుల్ గాంధీ, సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పై బీజేపీ ఎమ్మెల్యే కేశవ్ ప్రసాద్ పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుపై శనివారం విచారణ జరగగా.. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఆ తర్వాత వారికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. అయితే, ఇదే కేసులో జూన్ 7న విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది.